గుంటూరు, సెప్టెంబర్ 19 : భూములపై ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గంలో భూములపై పూర్తి వివరాలుతో నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. ప్రతిపాదిత ప్రాజెక్టులకు, కొత్త ప్రాజెక్టులకు అవకాశాలు ఉన్నాయని అందుకుగాను ప్రభుత్వ, ప్రైవేట్ భూములు, దేవాదాయ, వక్ఫ్ భూములు, ఆక్రమణలకు గురైన భూములు, అభ్యంతరాలు కలిగిన భూములు తదితర భూములపై నివేదిక అందజేయాలన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. టిడ్కో నిర్మిస్తున్న గృహాలు, టిడ్కోకు ఇంకా అవసరం మేరకు కేటాయింపుకు, సి.ఆర్.డి.ఏ కు ప్రతిపాదిత రైల్వే లైన్ వంటి అంశాలను విశ్లేషించాలని సూచించారు. మంగళగిరి రహదారి భూముల వివరాలను కూడా పొందుపరచాలని ఆమె అన్నారు.ఈ సమావేశంలో తెనాలి సబ్ కలెక్టర్ సంజన సిన్హా, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజా వలి, జిల్లా పంచాయతీ అధికారి బి.వి.నాగ సాయి కుమార్, టిడ్కో పర్యవేక్షక ఇంజనీర్ ఉమా శంకర శాస్త్రి, మంగళగిరి నగరపాలక సంస్థ అధికారులు, తహసిల్దార్లు పాల్గొన్నారు.
202 Less than a minute