chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

PARUCHURU NEWS:దివ్యాంగుల ఆత్మగౌరవ ప్రతీక దివ్యాంగ శక్తి.. నేడు మంగళగిరిలో సీఎం శ్రీకారం!

పర్చూరు: రాష్ట్రంలోని దివ్యాంగుల సంక్షేమం, స్వావలంబన కోసం కూటమి ప్రభుత్వం మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం మంగళగిరిలో ఘనంగా ప్రారంభించనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 11.16 లక్షల మంది దివ్యాంగులకు నేరుగా లబ్ధి చేకూరుతుందని, సహాయకులతో కలిపి మొత్తం 12.76 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.

గతంలో ఉన్న పరిమితులను సడలిస్తూ, 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారికి ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. ముఖ్యంగా వైకల్య వర్గాల సంఖ్యను 4 నుండి 21కి పెంచి, విస్తృత స్థాయిలో సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగుల సహాయకులకు కూడా టికెట్ ధరలో 50 శాతం రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఉచిత ప్రయాణ పథకం అమలు కోసం ప్రభుత్వం ఏటా రూ. 207 కోట్లు ఆర్టీసీకి భరించనుంది. ఉగాది కానుకగా ఈ పథకాన్ని అందిస్తున్నామని, గతంలో ఇచ్చిన హామీని కేవలం రెండు నెలల్లోనే నెరవేర్చడం ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని ఏలూరి సాంబశివరావు కొనియాడారు.

ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తదితరులు దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించి, అనంతరం వారితో సహపంక్తి భోజనం చేయనున్నారని తెలిపారు. పర్చూరు నియోజకవర్గంలో ఉదయం 11 గంటలకు పర్చూరు బస్టాండ్‌లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడిస్తూ, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే మహిళల కోసం ‘స్త్రీశక్తి’ విజయవంతంగా నడుస్తోందని, ఇప్పుడు ‘దివ్యాంగ శక్తి’ ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.http://BAPATLA NEWS

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker