

సీఈవో ను సస్పెండ్ చేయాలి అంటూ కృష్ణాజిల్లా జడ్పిటిసిలు మరియు ఎంపీపీలు పోడియం వద్ద నిరసన…
జడ్పీ చైర్ పర్సన్ పాలకవర్గం ఆమోదం లేకుండా సుమారు 424 వర్కులు 24 కోట్ల రూపాయల పనులను కన్నమనాయుడు జడ్పీ సీఈవో రద్దుపరిచి ఆ విషయం చెప్పకుండా తీవ్రమైన పదజాలంతో చైర్మన్ ని విమర్శించడం జరిగింది.
జనవరి 26 రాజ్యాంగ దినోత్సవం రోజున జడ్పీ చైర్పర్సన్ పదవి అంటే ఒక కాపల కుక్కని సీఈఓ అనే దానికి అధికారి అని సీఈఓ ని అన్ని నిర్ణయాలు తీసుకుంటారని చైర్మన్ కేవలం ఆ పనులకి కాపలాగా మాత్రమే ఉండాలని తీవ్రమైన పదజాలంతో చైర్మన్గాన్ని దూషించడం జరిగింది. దానికి నిరసనగా జడ్పిటిసి సభ్యులు ఎంపీపీలు కలెక్టర్ దగ్గర తీవ్రమైన ఆగ్రహ వేషాలు వ్యక్తం చేశారు.
ఇటువంటి పరుష పదజాలం వాడిన సీఈఓ కే కన్నామ నాయుడు ని సస్పెండ్ చేయాలని గౌరవ జడ్పిటిసిలు ఎంపీపీలు ధర్నా చేస్తున్నారు.
జిల్లా పరిషత్ సభ్యులు ప్రతిపాదించిన వర్కులు కనీసం జడ్పీటీసీ సభ్యులకు చైర్పర్సన్ కి తెలియపరచకుండా రద్దు పరిచయ విధంగా తీవ్రమైన నిర్ణయాన్ని తీసుకొని ఉన్న జడ్పీ సీఈఓ పై చర్యలు తీసుకోవాలని జడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక కలెక్టర్ ని కోరడం జరిగింది…_







