
Vijayawada:నవంబర్ 11:-స్వాతంత్ర్య సమరయోధుడు, దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్.వి. రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారు మంగళవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన అజాద్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం డిప్యూటీ పోలీస్ కమిషనర్ శ్రీ కృష్ణ కాంత్ పాటిల్ ఐపీఎస్ గారు కూడా నివాళులర్పించారు.ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, విద్యారంగానికి బాటలు వేసిన మహానుభావుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి సేవలు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. ఆయన స్ఫూర్తితోనే ప్రతి ఏడాది నవంబర్ 11న “జాతీయ విద్యా దినోత్సవం” జరుపుకుంటున్నామని తెలిపారు.

విద్యా విభాగ అభివృద్ధికి చేసిన సేవలకు గుర్తుగా ఆయనకు భారత ప్రభుత్వం 1992లో “భారతరత్న” పురస్కారం ప్రదానం చేసిందని, 2008 నుంచి ఆయన పుట్టినరోజును జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుతున్నదని వివరించారు.మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్వాతంత్ర్య సమరయోధుడే కాకుండా పండితుడు, కవి, అనేక భాషలలో ప్రావిణ్యం కలిగిన వ్యక్తి అని, 11 సంవత్సరాలు విద్యాశాఖ మంత్రిగా సేవలందించారని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో డీసీపీ కృష్ణకాంత్ పాటిల్ ఐపీఎస్, సీఎస్‌బీ, సీసీآర్‌బీ, సీపీఓ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.







