
విజయవాడ: నవంబర్ 9:-డా.ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్ (విజయవాడ) 2025–26 విద్యా సంవత్సరానికి గాను కంపీటెంట్ అథారిటీ కోటా కింద ఎంబీబీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఫేజ్–3 వెబ్ ఆధారిత కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది.విశ్వవిద్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఫేజ్–2 ముగిసిన తర్వాత మిగిలిన ఖాళీలతో పాటు అదనంగా కల్పించిన సీట్లతో మొత్తం 262 సీట్లు ఫేజ్–3లో భర్తీ చేయనున్నారు. వీటిలో ఫేజ్–2 తర్వాత మిగిలిన 72 సీట్లు (SC–13, NCC & స్పోర్ట్స్ –59), నాట్ రిపోర్టెడ్ 17, ఫ్రీ ఎగ్జిట్ 48, అదనపు సీట్లు 125గా వివరించారు. ఈ సీట్ల మేట్రిక్స్ విశ్వవిద్యాలయ వెబ్సైట్లో అందుబాటులో ఉందని తెలిపారు.
అభ్యర్థులు 18 ఆగస్టు 2025న వెబ్సైట్లో ఉంచిన కౌన్సిలింగ్ విధాన సూచనలను పూర్తిగా చదవాలని యూనివర్సిటీ సూచించింది. సీటు కేటాయింపైన అభ్యర్థులకు వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా సందేశం పంపబడుతుంది. సీటు కేటాయింపు వివరాలు యూనివర్సిటీ వెబ్సైట్లో కూడా చూడవచ్చని తెలిపారు.ఫేజ్–3 (మాప్అప్ రౌండ్)లో సీటు పొందిన అభ్యర్థులు తమకు కేటాయించిన కళాశాలకు నిర్దిష్ట గడువులోగా హాజరై, అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, ప్రొవిజనల్ ఆలోట్మెంట్ ఆర్డర్, ప్రొవిజనల్ వెరిఫికేషన్ కాపీ సమర్పించి, ట్యూషన్ ఫీ మరియు కళాశాల ఫీజును చెల్లించాల్సి ఉంటుందని యూనివర్సిటీ స్పష్టం చేసింది. సీటు పొందిన తరువాత వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదని పేర్కొంది.ఇప్పటికే 2025 సెప్టెంబర్ 22న తరగతులు ప్రారంభమైనందున, కొత్తగా చేరే విద్యార్థులు తక్షణమే రిపోర్ట్ కావాలని సూచించింది. యూనివర్సిటీ ఫీ రూ.10,600 చెల్లించాక ప్రొవిజనల్ ఆలోట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఇప్పటికే ఫేజ్–1 లేదా ఫేజ్–2లో యూనివర్సిటీ ఫీ చెల్లించిన వారు మళ్లీ చెల్లించనవసరం లేదని వివరించారు.ఫేజ్–1 లేదా 2లో సీటు పొందిన అభ్యర్థి ఫేజ్–3లో మరో కళాశాలకు స్లైడ్ అయినట్లయితే, అతని ఒరిజినల్ సర్టిఫికెట్లు పాత కళాశాల నుండి కొత్త కళాశాలకు పంపబడతాయని, రీలీవింగ్ ఆర్డర్ అవసరం లేదని యూనివర్సిటీ తెలిపింది.అడ్మిషన్ సమయంలో ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతుంది. ఏదైనా తేడా తేలితే ఆ అభ్యర్థి కేటాయింపు రద్దు చేయబడుతుంది.ఫేజ్–3 అనంతరం ఎలాంటి అప్గ్రేడేషన్ లేదా ఫ్రీ ఎగ్జిట్ అవకాశం ఉండదని యూనివర్సిటీ స్పష్టం చేసింది. కంపీటెంట్ అథారిటీ కింద ఫేజ్–3లో సీటు పొందిన వారు మ్యానేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్లో పాల్గొనరాదని హెచ్చరించింది.సీటు బ్లాకింగ్ లేదా సీట్ల రద్దు చర్యలకు యూనివర్సిటీ సహకరించదని, అలా ప్రయత్నించే విద్యార్థులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.వివరాల కోసం విద్యార్థులు యూనివర్సిటీ వెబ్సైట్ https://drntr.uhsap.in/ ను సందర్శించాలని రిజిస్ట్రార్ డా.వి.రాధికా రెడ్డి సూచించారు.







