
ఏలూరు జిల్లా: కామవరపుకోట:-30-11-25:-కీర్తి శేషులు మేడవరపు అశోక్ శ్రీనివాసరావు జయంతి వేడుకలు కామవరపుకోటలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు అల్లూరి పెద్దరాజు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పేదవారికి ఎల్లప్పుడూ అండగా నిలిచిన నాయకుడు అశోక్ శ్రీనివాసరావు అని, ప్రజల సేవలో తన జీవితాన్ని అంకితం చేశారని గుర్తు చేశారు. మండల అభివృద్ధికి ఆయన చేసిన కృషి ఎంతో విశేషమని, అనేక మంది యువ నాయకులను రాజకీయంగా తీర్చిదిద్దిన వ్యక్తి అని పెద్దరాజు తెలిపారు.ఈ వేడుకల్లో జెడ్‌పీటీసీ కడిమి రమేశ్, మాజీ మండల అధ్యక్షులు మీడత రమేశ్, ఎంపీటీసీ అంజిరెడ్డి, తడికలపూడి సర్పంచ్ శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.







