
అమరావతి:నవంబరు 10:-రాష్ట్రంలోని జర్నలిస్టులకు 2026–2027 రెండేళ్ల కాలానికి అక్రిడిటేషన్లు జారీ చేసేందుకు రూపొందించిన **‘మీడియా రిలేషన్స్ పోర్టల్’**ను సమాచార, పౌర సంబంధాలు మరియు గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్ధసారధి సోమవారం లాంఛనంగా ప్రారంభించారు.ఎపి సచివాలయం ప్రచార విభాగంలో జరిగిన ఈ కార్యక్రమంలో సమాచారశాఖ సంచాలకులు కె.ఎస్. విశ్వనాధన్తో కలిసి మంత్రి పోర్టల్‌ను ఆవిష్కరించారు.
గతంలో జారీ చేసిన జర్నలిస్టుల అక్రిడిటేషన్ల గడువు ఈ నెల 30తో ముగియనుండగా, రాబోయే రెండేళ్ల (2026–2027) కాలానికి కొత్త అక్రిడిటేషన్ల జారీ కోసం వివిధ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో పనిచేసే ప్రతినిధుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు.రాష్ట్ర మరియు జిల్లాస్థాయి అక్రిడిటేషన్లకు అర్హులైన జర్నలిస్టులు ఈ పోర్టల్ ద్వారా ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి స్పష్టం చేశారు. అలాగే దరఖాస్తు చేసిన ప్రతినిధులు తమ అప్లికేషన్ స్టేటస్‌ను కూడా వెబ్‌సైట్‌లో నేరుగా తెలుసుకునే సౌకర్యం కల్పించబడిందని పేర్కొన్నారు.పోర్టల్‌లో దరఖాస్తు చేసుకునే విధానం, అవసరమైన పత్రాల వివరాలను మంగళవారం పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించనున్నట్లు తెలిపారు.







