
అద్దంకి:డిసెంబర్;-12-12-25:-మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రజల నుండి సేకరించిన సంతకాలను జిల్లా కేంద్రానికి పంపించే కార్యక్రమంలో భాగంగా అద్దంకి నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీకి అద్దంకి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ గారు, పార్టీ నియోజకవర్గ పరిశీలకులు కర్నేటి వెంకట ప్రసాద్ గారు ముఖ్య అతిథులుగా హాజరు కాగా, పార్టీ నాయకులు, కార్యకర్తలు విశాల సంఖ్యలో పాల్గొన్నారు.
అద్దంకి వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీ, నినాదాలతో ముందుకు సాగుతూ పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా శోభాయాత్రగా కొనసాగింది. ప్రజా ఆరోగ్య హక్కు కోసం, ప్రభుత్వ మెడికల్ వ్యవస్థ బలోపేతం కోసం, విద్య–ఆరోగ్య రంగాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజలు ఏకতాటిపైకి రావాలని నాయకులు పిలుపునిచ్చారు.ర్యాలీ ప్రారంభానికి ముందు మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారు, అమరజీవి పొట్టి శ్రీరాములు గారు, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ గారి విగ్రహాలకు నేతలు పుష్పగుచ్ఛాలు సమర్పించి నివాళులు అర్పించారు.
Bapatla Local News ప్రజల సంక్షేమం కోసం పోరాటం అనేది వైఎస్సార్ సీపీ సిద్ధాంతం అని, వైఎస్సార్ చూపిన ప్రజా పాలన మార్గాన్ని అనుసరిస్తూ ప్రజల సమస్యలపై నిరంతరం నిలబడాలని నాయకులు ఈ సందర్భం గా హామీ ఇచ్చారు.ప్రజలు, విద్యార్థులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొని ప్రభుత్వ సేవల బలోపేతానికి మద్దతు తెలిపారు. నాయకుల పిలుపుతో ర్యాలీ ఉత్సాహంగా మారి ప్రజల్లో అవగాహన పెంచింది. సేకరించిన సంతకాల పత్రాలను తరువాత జిల్లా కేంద్రాధికారులకు పంపించడానికి పార్టీ ప్రతినిధులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.







