

మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపుతో గన్నవరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ఆదేశానుసారంగా
గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విజయవాడ రూరల్ మండలం అంబాపురం గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ గ్రామ అధ్యక్షుడు నల్లమోతు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు నల్లమోతు చంద్రశేఖర్,పార్టీ కార్యకర్తలు,కొడాలి భరత్, దొండపాటి షడ్రక్, నందేటి చినబాబు, రమేష్,సొంగ బాబి, కొడాలి ప్రవీణ్,చెబోయిన కిషోర్ వీర్ల సాంబ మరియు,పెద్దలు ,పార్టీ నాయకులు పాల్గొన్నారు








