
మంగళగిరి:-మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమానికి మంగళగిరిలో భారీ స్పందన లభించింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మంగళగిరి నియోజకవర్గంలో మంగళవారం నిర్వహించిన ర్యాలీ జాతరను తలపించింది.

మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. గుంటూరు జిల్లా మంగళగిరి బస్టాండ్ సెంటర్‌లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం ర్యాలీ ప్రారంభమైంది. అక్కడి నుంచి గాలిగోపురం, మెయిన్ బజార్, సీతారామ కోవెల మీదుగా గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది.

ఈ కార్యక్రమంలో తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల మండలాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కోటి సంతకాల ఉద్యమానికి మద్దతు తెలిపారు. AIIAMS Mangalagiri loమెడికల్ విద్యను ప్రైవేటీకరణ నుంచి రక్షించాలంటూ నినాదాలు చేశారు.










