chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా

JAGGAIAH PETA NEWS:మెడికల్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలి సిపిఐ డిమాండ్

జగ్గయ్యపేట తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా.. వినతిపత్రం సమర్పణ

జగ్గయ్యపేట: రాష్ట్రంలో పెచ్చుమీరిపోతున్న మెడికల్ మాఫియా ఆగడాలను అరికట్టాలని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి అంబోజి శివాజీ డిమాండ్ చేశారు. శనివారం జగ్గయ్యపేట మండల తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఐ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఆందోళన నిర్వహించారు.

ఈ సందర్భంగా అంబోజి శివాజీ మాట్లాడుతూ.. మెడికల్ మాఫియా జలగల మాదిరిగా సామాన్య ప్రజల రక్తాన్ని పీల్చుతున్నారని మండిపడ్డారు. జగ్గయ్యపేట ప్రాంతంలో అస్తవ్యస్త వైద్యం కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.

శివాజీ లేవనెత్తిన ప్రధాన అంశాలు:

  • ఆర్.ఎం.పిల అక్రమాలు: గ్రామీణ వైద్యులు (RMP) నిబంధనలకు విరుద్ధంగా, అనుమతి లేని మందులను నిల్వ ఉంచి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారని ఆరోపించారు.
  • మెడికల్ షాపుల దందా: జనరిక్ మందుల పేరుతో నాణ్యత లేని, అనుమతులు లేని ఫార్మా కంపెనీల మందులను విక్రయిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.
  • అధికారుల ఉదాసీనత: మెడికల్ అధికారులు తనిఖీలు చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో వాస్తవాలను దాచిపెడుతూ మాఫియాకు కొమ్ముకాస్తున్నారని ధ్వజమెత్తారు.

ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వెంటనే తనిఖీలు ముమ్మరం చేయాలని, దోషులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేశNtrdistrict local news Telugu:ఎన్టీఆర్

ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి మెటికల శ్రీనివాసరావు, నాయకులు పోతుపాక వెంకటేశ్వర్లు, నంబూరి చలపతిరావు, షేక్ చిన్న మీరా, షేక్ కరీం, బోగ్యం నాగులు, కరిసే మధు, సీతారాములు, వేమవరపు ఫ్రాన్సీస్ తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker