chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
అమరావతిఆంధ్రప్రదేశ్

Amaravathi Local News :మీ భూమి–మీ హక్కు కార్యక్రమంలో పాల్గొనున్న సీఎం చంద్రబాబు కలుగట్లలో పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ

అమరావతి, ఫిబ్రవరి 5:-మీ భూమి–మీ హక్కు కార్యక్రమంలో భాగంగా పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. కలుగట్ల గ్రామంలో నిర్వహించే గ్రామసభలో సీఎం పాల్గొని రైతులకు కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలను అందజేస్తారు.

శుక్రవారం ఉదయం అమరావతిలోని క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరే ముఖ్యమంత్రి 11.30 గంటలకు కలుగట్లకు చేరుకుంటారు. గ్రామసభలో పాస్‌పుస్తకాల పంపిణీ అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి మధ్యాహ్నం 2 గంటలకు రైతులతో ముఖాముఖి చర్చలో పాల్గొంటారు. తదనంతరం పార్టీ క్యాడర్ మీటింగ్‌కు హాజరై, సాయంత్రం 5.30 గంటలకు అమరావతికి తిరిగి చేరుకుంటారు.

ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు గ్రామాల చొప్పున మొత్తం 279 గ్రామాల్లో కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ చేపట్టింది. ప్రస్తుతం 1,16,870 డ్రాఫ్ట్ పాస్‌పుస్తకాలు సిద్ధంగా ఉండగా, వాటిలో 91,038 డ్రాఫ్ట్ పాస్‌పుస్తకాల eKYC ప్రక్రియ పూర్తయింది.Amaravathi Local News

కర్నూలు జిల్లాలోని 13 గ్రామాల్లో 8,347 మంది రైతులకు కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలు అందించనుండగా, కలుగట్ల గ్రామంలో శుక్రవారం 1,178 మంది రైతులకు సీఎం చేతుల మీదుగా పాస్‌పుస్తకాలు పంపిణీ చేయనున్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker