
గుంటూరు:నవంబరు 10:-ఆర్థిక రంగంలో క్లెయిమ్ చేయని ఆస్తులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ చేపట్టిన “మీ డబ్బు – మీ హక్కు” (Your Money – Your Right) ప్రచారం పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కలెక్టర్‌తో పాటు జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కే. ఖాజావలి, డిప్యూటీ కలెక్టర్లు గంగరాజు, లక్ష్మీకుమారి, లీడ్ బ్యాంకు మేనేజర్ మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు.జిల్లాలో మొత్తం 7,18,055 రిటైల్ ఖాతాలలో రూ.120 కోట్లు, 24,221 సంస్థలు, ఆర్గనైజేషన్ ఖాతాలలో రూ.22.02 కోట్లు, అలాగే 6,672 ప్రభుత్వ ఖాతాలలో రూ.7.03 కోట్లు — మొత్తంగా రూ.149.47 కోట్లు విలువైన అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు ఉన్నాయని ఎల్‌డీఎం తెలిపారు.
బీమా పాలసీ క్లెయిమ్స్, బ్యాంక్ డిపాజిట్లు, డివిడెండ్లు, షేర్లు, మ్యూచువల్ ఫండ్ రాబడులు వంటి క్లెయిమ్ చేయని ఆర్థిక ఆస్తులను ప్రజలు స్వంతం చేసుకోవాలనే ఉద్దేశంతో “మీ డబ్బు – మీ హక్కు” ప్రచారం ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పీడీ డీఆర్‌డీఏ విజయలక్ష్మి, జిల్లా విద్యాశాఖాధికారి రేణుక, పశుసంవర్ధక శాఖ జేడీఏ సత్యనారాయణ, జిల్లా ఉపాధి అధికారి దుర్గాబాయి, ఏడి మైక్రో ఇరిగేషన్ వజ్రశ్రీ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ చక్రవర్తి, కలక్టరేట్ ఏఓ పూర్ణ చంద్రరావు, హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ మల్లేశ్వరి తదితర అధికారులు పాల్గొన్నారు.







