వినుకొండ :- పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు తెలియజేయడం ఏమనగా నంద్యాల, శాంతిరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో వినుకొండ పెన్సనర్స్ ఉద్యోగుల సేవా సంఘం వారి సహకారం తో ఈ నెల 15వ తేదీన మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్స్ సంఘం భవనం నందు ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. కావున ప్రతి ఒక్కరూ అనగా ఈ.హెచ్.ఎస్ హెల్త్ కార్డు, ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్సు కార్డు, జర్నలిస్ట్ కార్డు ఉన్నవారికీ ఉచిత కంటి పరీక్షలు చేసి కంటి శుక్లము ఉన్నవారికి నంద్యాల హాస్పిటల్ నందు వారి వాహనములో తీసుకోని వెళ్లి ఆపరేషన్ చేయించడం జరుగుతుందని సంఘం అధ్యక్షులు భువనగిరి సుబ్రహ్మణ్యం, జనరల్ సెక్రటరీ శ్రీ కృష్ణమూర్తి, ఆర్గనైజర్ ఉరుకుందప్ప మరియు సంఘం మెంబర్స్ తెలియజేయడం జరిగింది. కావున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కంటి వైద్య శిబిరం నందు పాల్గొని సద్వినియోగం చేసుకోగలరు.
241 Less than a minute