
బాపట్ల:పర్చూరు : చినగంజం:-చినగంజం మండలంలో నిర్వహించిన మెగా పేరెంట్స్ మీటింగ్‌లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని వసతులతో పాటు నాణ్యమైన విద్యను ప్రభుత్వం అందిస్తోందని ఎంపీడీవో ధనలక్ష్మి తెలిపారు. శుక్రవారం మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించిన పేరెంట్స్ మీటింగ్‌లో ఆమె పాల్గొని మాట్లాడారు.

కడవకుదురు జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో తహసీల్దార్ ప్రభాకర్ కూడా పాల్గొని తల్లిదండ్రులతో పరస్పరం మాట్లాడారు. మండలంలోని పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు విస్తృతంగా హాజరయ్యారు.

స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో పూర్వ విద్యార్థులు విద్యార్థులకు మూడు సైకిళ్లను అందజేశారు. అదేవిధంగా పలు పాఠశాలల్లో విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.







