
చిన్నగంజాం మండలం, పర్చూరు నియోజకవర్గం — బాపట్ల జిల్లా
మొంథా తుపాన్ ప్రభావంతో మంగళవారం రాత్రి కురిసిన గాలి వానల కారణంగా బాపట్ల జిల్లాలోని పర్చూరు నియోజకవర్గం చిన్నగంజాం మండలంలోని పలు గ్రామాల రాకపోకలు అంతరాయం కలిగాయి.
ముఖ్యంగా పెద్దగంజాం–ఉప్పుగుండూరు మధ్యలో ఉన్న బుచ్చిగుంట వద్ద రహదారిపై నీరు పొంగిపొర్లడంతో వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా ఈ రెండు గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
స్థానికులు చెబుతున్నట్లుగా, నీటి మట్టం తగ్గకపోతే మరోరోజు వరకు రాకపోకలు సాధ్యంకాదని భావిస్తున్నారు. అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తూ, నీరు తగ్గిన వెంటనే రహదారి పునరుద్ధరణ చర్యలు చేపడతామని తెలిపారు.







