
మొంథా తుఫాను ప్రభావం నేపథ్యంలో పెదనందిపాడు, ప్రత్తిపాడు మండలాల్లో పరిస్థితులను స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు.
మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ, అధికారులతో సమన్వయం కొనసాగిస్తున్నట్లు ఎమ్మెల్యే గారు తెలిపారు.
తుఫాను కారణంగా రోడ్లపై చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలడం, రహదారులు దెబ్బతినడం వంటి పరిస్థితులు ఊళ్ల మధ్య రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
వర్ష ప్రభావంతో వాగులు పొంగి ప్రవహించే ప్రాంతాల్లో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అదేవిధంగా, పెదనందిపాడు మరియు ప్రత్తిపాడు మండలాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను ఎమ్మెల్యే సందర్శించి, అక్కడ ఉన్న ప్రజల పరిస్థితిని తెలుసుకున్నారు.
మండలంలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామాల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
“ప్రజలకు ఎటువంటి నష్టం జరగకుండా ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోంది. అత్యవసరమైతే తప్ప ఇళ్లనుంచి బయటకు రావద్దని ప్రజలు జాగ్రత్తలు పాటించాలి” అని ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు ప్రజలను సూచించారు.







