chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Bapatla Local news: మినీ అంగన్వాడి కేంద్రాలను సాధారణ అంగన్వాడి కేంద్రాలుగా మార్పు- కలెక్టర్ వినోద్ కుమార్.వి

బాపట్ల:22-11-25:-జిల్లాలోని మినీ అంగన్‌వాడీ కేంద్రాలను పూర్తి స్థాయి సాధారణ అంగన్‌వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి తెలిపారు. శనివారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.కలెక్టర్ మాట్లాడుతూ…
గర్భిణీలు, బాలింతలకు మెరుగైన సేవలు అందించడం, ప్రీ–స్కూల్ విద్యార్థుల అభ్యాసానికి అనుకూల వాతావరణం కల్పించడం లక్ష్యంగా మినీ కేంద్రాలను సాధారణ కేంద్రాలుగా మార్చుతున్నామని చెప్పారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న 16 మినీ అంగన్‌వాడీ కేంద్రాలన్నింటిని అప్‌గ్రేడ్ చేసే ప్రక్రియ ప్రారంభమైనట్లు వెల్లడించారు. కమిటీ ఆమోదం పొందిన వెంటనే ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక పంపుతున్నామని తెలిపారు.

మార్పుల వల్ల లభించే ప్రయోజనాలపై మాట్లాడుతూ— గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం సకాలంలో అందించడానికి ఈ అప్‌గ్రేడ్ తోడ్పడుతుందని చెప్పారు. అలాగే మినీ అంగన్‌వాడీ కార్యకర్తల గౌరవ వేతనం కూడా రూ.7,000 నుంచి రూ.11,500కు పెరగనున్నట్లు వివరించారు. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం కేంద్రాల్లో మార్పులు చేపడుతున్నామని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ రాధా మాధవి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్.విజయమ్మ, డీఈఓ పురుషోత్తం, బాపట్ల ఆర్డీవో పి.గ్లోరియా తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker