

బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం నల్లమోతు వారి పాలెం సెగ్మెంట్ లోని కొత్త నందాయ పాలెం మరియు నల్లమోతువారిపాలెం గ్రామాల అభివృద్ధికై కర్లపాలెం మండల పరిషత్ లో ఆమోదింపబడిన నిధుల విడుదల కోసం బాపట్ల శాసన సభ్యులు శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు ను తన కార్యాలయంలో కలిసి అభ్యర్ధిస్తున్న నల్లమోతువారిపాలెం ప్రాదేశిక నియోజవర్గ ఎంపీటీసీ సభ్యులు తాండ్ర సాంబశివరావు మరియు కొత్త నందాయ పాలెం సర్పంచ్ ఆట్ల వెంకటేశ్వరమ్మ తరపున ఆ గ్రామ సీనియర్ టీడీపీ నేత ఆట్ల అయ్యప్ప రెడ్డి.
శాసన సభ్యులు శ్రీ వేగేశన తో భేటీ అనంతరం ఎంపీటీసీ తాండ్ర మాట్లాడుతూ, తన ప్రాదేశిక నియోజకవర్గంలోని నల్లమోతువారి పాలెం మరియు కొత్త నందాయ పాలెం గ్రామాల అభివృద్ధికి మండల పరిషత్ లో ఆమోదింపబడిన నిధులు విడుదల కై తక్షణ చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చిన MLA వేగేశనకు ధన్యవాదాలు తెలియ చేశారు.







