ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు చేతుల మీదుగా సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
నరసరావుపేట నియోజకవర్గంలో మంగళవారం సీఎం సహాయ నిధి ద్వారా లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. నరసరావుపేట శాసనసభ్యులు డా. చదలవాడ అరవింద బాబు, నియోజకవర్గ వ్యాప్తంగా ఎంపికైన 19 మంది లబ్ధిదారులకు మొత్తం ₹14,80,000 విలువైన చెక్కులను స్వయంగా అందించారు. ఈ కార్యక్రమం నరసరావుపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగింది.
ఎమ్మెల్యే అరవింద బాబు మాట్లాడుతూ, ప్రజలకు అవసరమైన సమయంలో ఆర్థిక సహాయం అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నానని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహాయంతో ఈ నిధులు లబ్ధిదారుల వద్దకు చేరాయని చెప్పారు. వైద్య చికిత్సలు, అత్యవసర శస్త్రచికిత్సలు, మరియు తీవ్రమైన అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవారికి ఈ నిధులు ఎంతగానో ఉపయోపడతాయని ఆయన వివరించారు.
చెక్కులు స్వీకరించిన లబ్ధిదారులు ఎమ్మెల్యే అరవింద బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. తమ వైద్య ఖర్చులకు ఈ ఆర్థిక సహాయం ఎంతో ఉపశమనం కలిగించిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి ఈ సహాయం అందేలా కృషి చేసినందుకు ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సీఎం సహాయ నిధి ద్వారా ఇలాంటి సహాయం మరింత మందికి చేరేలా ప్రయత్నిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అవసరమైన పత్రాలు సమర్పించిన అర్హులైనవారికి ప్రభుత్వం తరపున ఈ సహాయం అందించే ప్రక్రియను వేగవంతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
ప్రజల సంక్షేమం కోసం చేపడుతున్న పథకాలు, ముఖ్యంగా వైద్య సహాయం అందించడంలో సీఎం సహాయ నిధి పాత్ర ఎంతో ముఖ్యమని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఈ నిధులు ఎప్పుడూ అవసరంలో ఉన్న వారికి అండగా నిలుస్తాయని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
నరసరావుపేట నియోజకవర్గ ప్రజలతో ఎల్లప్పుడూ ఉంటానని, వారి సమస్యలు పరిష్కరించడంలో ముందుండి కృషి చేస్తానని ఎమ్మెల్యే డా. చదలవాడ అరవింద బాబు పునరుద్ఘాటించారు.