
గుంటూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ గారి కుమార్తె వివాహ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హాజరయ్యారు. గుంటూరులోని శ్రీ కన్వెన్షన్‌లో అత్యంత వైభవంగా జరిగిన ఈ వివాహ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమంత్రి, నూతన వధూవరులు నాగసాయి వైదీప్తి, కెవిన్ రామ్‌లను ఆశీర్వదించారు. వధూవరులకు పుష్పగుచ్ఛం అందించి, వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధూళిపాళ్ల కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రికి సాదర స్వాగతం పలికారు. ఈ వేడుకలో పలువురు రాజకీయ ప్రముఖులు, పార్టీ శ్రేణులు పాల్గొని కొత్త జంటను దీవించారుhttp://GUNTUR NEWS







