పల్నాడుఆంధ్రప్రదేశ్
MLA Dr. Chadalawada Aravinda Babu visited the Kotappakonda DRDA office
నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు సోమవారం (జులై 28, 2025) కోటప్పకొండలోని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (DRDA) కార్యాలయాన్ని సందర్శించారు. ఈ కార్యాలయ భవనం ఇటీవల మరమ్మత్తులు పూర్తి చేయడంతో, ఎమ్మెల్యే ఈ అభివృద్ధి పనులను పరిశీలించారు.DRDA కార్యాలయంలో స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ సెంటర్ నిర్వహిస్తున్న నేపథ్యంలో, విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు DRDA సిబ్బందితో సమావేశమై, కార్యాలయ నిర్వహణ మరియు అభివృద్ధి పనుల గురించి చర్చించారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.