
ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తెస్తున్నదని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. మంగళవారం గుంటూరు 24వ డివిజన్ అంకమ్మ నగర్ లోని అంగన్వాడి స్కూల్ నందు నియోజకవర్గంలోని 150 అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్ లు మరియు వంట సామాగ్రి పంపిణి కార్యక్రమానికి ఎమ్మెల్యే గళ్ళా మాధవి ముఖ్య అతిధిగా హాజరయ్యి, కిట్ లను ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి పంపిణి చేసారు. తొలుత ప్రీ స్కూల్ విద్యను ముగించుకొని వెళ్తున్న బాలలకు వినూత్నంగా నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే ను జరుపుకొని సర్టిఫికెట్లను ఎమ్మెల్యే గళ్ళా మాధవి అందజేశారు. ఈ సందర్భముగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ…. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్వాడీ స్కూళ్లలో గ్యాస్ కొరతను అధిగమించేందుకు ఎలక్ట్రికల్ స్టవ్ (ఇండక్షన్), ఇతర సామాగ్రినిని అందిస్తున్నదని, ఇందులో భాగంగా నేడు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 150 అంగన్వాడీ కేంద్రాలకు 10వేలు విలువ చేసే వంట సామాగ్రిని అందజేయటం జరిగింది. అంగన్వాడీ స్కూళ్లలో మెరుగయిన వసతులు కల్పించటం కోసం స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యరాణి కృషి చేస్తున్నారని, అదేవిధముగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషితో లక్షలాది మంది తల్లులకు తల్లికి వందనం ద్వారా లబ్ది చేకూర్చారని ఎమ్మెల్యే గళ్ళా మాధవి కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఐసిడియస్ ప్రాజెక్ట్ అధికారి అరుణ, సరోజినీ, మేరీ, కార్పొరేటర్ అడకా పద్మావతి, రాజీవ్ ఆనంద్, చెంబేటి మణికుమారి, లామ్ నవమి, గాడిదపాటి కోటేశ్వరావు, కామినేని చంద్ర, ముత్తినేని రాజేష్, షేక్ బాబు, బుడే, తుమ్మల నాగేశ్వరావు, పఠాన్ ఇమ్రాన్, సైదా, సాల్మన్ రాజు, యాకోబు, మొవ్వా వేణుబాబు, గుర్రం ప్రసాద్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.







