
గుంటూరు :02-11-25:-గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి సూచనల మేరకు, భారత్ మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్ పోటీలో విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.ముంబైలో భారత్–దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించాలని కోరుతూ, గుంటూరు బృందావన్ గార్డెన్స్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ ప్రత్యేక పూజలు జరిగాయి.ఈ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన ఎన్డీయే కూటమి మహిళా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

ఈ సందర్భంగా మహిళా నేతలు మాట్లాడుతూ –“మహిళల ప్రగతికి, సాధికారతకు ప్రధాని నరేంద్ర మోడీ గారు, మన రాష్ట్ర నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు నిరంతరం కృషి చేస్తున్నారు. మహిళల పక్షపాతులుగా వీరి ప్రోత్సాహంతో దేశవ్యాప్తంగా అనేక మహిళలు విజయాలు సాధిస్తున్నారు. అదే స్ఫూర్తితో మన భారత మహిళా క్రికెట్ జట్టు కూడా ప్రపంచకప్‌లో విజయం సాధించి దేశానికి గర్వకారణం అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం,” అని తెలిపారు.

తరువాత మహిళా నేతలు దీపారాధన చేసి, పూలమాలలు సమర్పిస్తూ భారత జట్టు విజయాన్ని ఆకాంక్షించారు.భారత మహిళా జట్టు విజయం దేశ గౌరవమని, అందరి ప్రార్థనలు ఫలిస్తాయని వారు నమ్మకం వ్యక్తం చేశారు.







