
చీరాల: నవంబర్ 24 :-చీరాల క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ఆధ్వర్యంలో గ్రామ పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జీలతో సమావేశం జరిగింది. నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ అనుబంధ కమిటీలపై సమగ్ర సమీక్ష నిర్వహించినట్టు సమాచారం.

సమీక్షా సమావేశంలో పార్టీ బలాన్ని పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలు, గ్రామ స్థాయి కమిటీల పనితీరు, రాబోయే కార్యక్రమాలపై ఎమ్మెల్యే నాయకులకు దిశానిర్దేశం చేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కౌతరపు జనార్ధన్, టీడీపీ సీనియర్ నాయకుడు గుదంటి చంద్రమౌళి, చీరాల మండల అధ్యక్షుడు గంజి పురుషోత్తం, పట్టణ అధ్యక్షుడు దోగుపర్తి వెంకట సురేష్ సహా గ్రామ పార్టీ నాయకులు పాల్గొన్నారు.







