కృష్ణాజిల్లాగుడివాడనియోజకవర్గ పరిధిలోని 36 బాధిత కుటుంబాలకు రూ.20.20 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు , మరియు ఎల్ఓసి పత్రాలను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అందజేశారు.పలువురు బాధిత కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతూ కష్టకాలంలో అండగా ఆదుకున్నారంటూ కృతజ్ఞతలు తెలిపారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ…. రాష్ట్రంలోని పేదవర్గాల సంక్షేమమే సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా అనారోగ్య సమస్యలతో కష్టకాలంలో ఉన్న పేదవర్గాలకు భరోసాగా ఏడాది పాలనలోనే 490 కోట్ల ముఖ్యమంత్రి సహాయ నిధి నిధులు మంజూరయ్యాయన్నారు. గుడివాడ నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో రెండు కోట్ల 14 లక్షల చెక్కులు ఇప్పటివరకు అందించినట్లు ఎమ్మెల్యే రాము తెలిపారు.ఇప్పటికే వృద్ధ వికలాంగ పెన్షన్లు పెంచడమే కాకుండా, సూపర్ సిక్స్ హామీలను వడివడిగా అమలు చేస్తుండటాన్ని మనందరం చూస్తున్నామన్నారు. పేద వర్గాల అభ్యున్నతికి ఎన్టీఆర్, సీఎం చంద్రబాబు చేస్తున్న కృషిని స్పూర్తిగా తీసుకొని ముందుకు సాగుతానన్నారు
227 Less than a minute