
Bapatla:మార్టూరు:13-11-25;-తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం, నిస్వార్థంగా కష్టపడిన ప్రతి ఒక్కరికీ పార్టీ లో గౌరవం, గుర్తింపు లభిస్తుందని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పేర్కొన్నారు. గురువారం ఆయన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మండల, క్లస్టర్, యూనిట్, గ్రామ, బూత్ కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రసంగించారు.తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, “పార్టీ అధికారంలోకి రావడంలో క్లస్టర్, యూనిట్, బూత్ స్థాయి వ్యవస్థ కీలక పాత్ర పోషించింది. ఈ వ్యవస్థ వల్ల పార్టీ సిద్ధాంతాలు, కార్యక్రమాలు ప్రజల్లోకి విస్తృతంగా చేరాయి. ప్రతి కార్యకర్త కృషి ఫలితమే నేటి విజయం” అని తెలిపారు.
ప్రతి కార్యకర్తకు గుర్తింపు, గౌరవం“పార్టీలో అందరూ సమానమే. పని చేసిన వారందరికీ గుర్తింపు తప్పకుండా లభిస్తుంది. ఇది కేవలం పదవి కాదు—పార్టీ పట్ల ఉన్న నిబద్ధతకు ఇచ్చిన గౌరవం,” అని ఎమ్మెల్యే ఏలూరి స్పష్టం చేశారు.వైసిపి దుష్ప్రచారానికి ప్రతిస్పందన అవసరం“వైసిపి చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రతి కార్యకర్త తిప్పికొట్టాలి. ప్రజల్లోకి పార్టీ సిద్ధాంతాలను తీసుకెళ్లండి. తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని గెలుచుకుందనే విషయాన్ని గుర్తు చేయండి,” అని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.స్థానిక ఎన్నికల్లో విజయం లక్ష్యంరాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం సాధించేందుకు ప్రతి మండల, గ్రామ, బూత్ స్థాయిలో కృషి చేయాలని సూచించారు. “ఈ ఎన్నికల ఫలితమే పార్టీ భవిష్యత్తుకు పునాది వేస్తుంది,” అని ఆయన తెలిపారు.అభివృద్ధి పనుల జాబితానియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే వివరించారు.
- ₹80 కోట్లతో సీసీ రోడ్లు₹8 కోట్లతో గోకులాలు₹60 కోట్లతో ఆర్ అండ్ బి రోడ్లు₹16 కోట్లతో పిఐయూ రోడ్లు₹10 కోట్లతో సీఎం సహాయనిధి ద్వారా 1170 మందికి ఆర్థిక సాయం₹3 కోట్లతో కే.డబ్ల్యూ.డి అభివృద్ధి₹1.5 కోట్లతో ఎన్‌ఎస్‌పీ కాలువలు₹3.5 కోట్లతో డ్రైనేజీ పనులు,
- “ఇలా నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది,” అని ఎమ్మెల్యే వెల్లడించారు. ఘనంగా వేడుక….
- బూతు క్లస్టర్ యూనిట్ గ్రామ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవ వేడుక కన్నుల పండుగ జరిగింది. వేలాది మంది కార్యకర్తలతో ఎమ్మెల్యే ఏలూరి క్యాంపు కార్యాలయం పండుగ వాతావరణం తలపించింది.ఈ సందర్భంగా కేక్ కట్ చేసి నూతన కమిటీ సభ్యులందరికీ అభినందనలు తెలిపారు. అలాగే రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లు తిరుమల శెట్టి శ్రీహరి, షేక్ శంషుద్దీన్, కోడూరి శేష బ్రహ్మచారి, కారుమంచి కృష్ణ , హుస్సేన్ లను పూలమాల శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గుంజి వెంకటరావు, మండల పార్టీ అధ్యక్షులు తాటి నాగేశ్వరరావు, నాయుడు హనుమంతరావు, నల్లపునేని రంగయ్య చౌదరి, షేక్ సంసుద్దీన్ , తిరుమల శెట్టి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.







