chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

Narasaraopet Local news :మొక్కజొన్న రైతులకు తక్షణమే సాగర్ జలాలు విడుదల చేయాలి

నరసరావుపేట, జనవరి;-నరసరావుపేట నియోజకవర్గంలోని మొక్కజొన్న రైతులకు తక్షణమే నాగార్జున సాగర్ జలాలను విడుదల చేయాలని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సంజన సిన్హాను మంగళవారం కోరారు.

Narasaraopet Local news :మొక్కజొన్న రైతులకు తక్షణమే సాగర్ జలాలు విడుదల చేయాలి

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నియోజకవర్గంలో అధిక విస్తీర్ణంలో మొక్కజొన్న పంట సాగు చేస్తున్న రైతులు ఇప్పటికే ఒక్కో ఎకరాకు సుమారు రూ.50 వేల వరకు పెట్టుబడి పెట్టారని తెలిపారు. ప్రస్తుతం సాగునీటి సరఫరా లేకపోవడం వల్ల పంటలు ఎండిపోయే ప్రమాదం నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారునరసరావుపేటలో అభివృద్ధి పనులకు నూతన ఊపు||Development Works Gain Momentum in Narasaraopet.

రైతుల కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని కనీసం మరో 15 రోజుల పాటు నిర్విరామంగా సాగర్ జలాలు విడుదల చేసేలా సంబంధిత ఇరిగేషన్ అధికారులకు తక్షణమే ఆదేశాలు ఇవ్వాలని జాయింట్ కలెక్టర్‌ను ఎమ్మెల్యే కోరారు. నీటి కొరత కారణంగా పంటలు నష్టపోతే రైతులు తీవ్ర ఆర్థిక నష్టానికి గురవుతారని పేర్కొన్నారు.

రైతుల ప్రయోజనాలే ప్రభుత్వ ప్రాధాన్యతగా తీసుకుని జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి తగిన చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు కోరారు.

Narasaraopet Local news :మొక్కజొన్న రైతులకు తక్షణమే సాగర్ జలాలు విడుదల చేయాలి

కోటప్పకొండలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలి

జిల్లా జాయింట్ కలెక్టర్‌కు వినతి చేసిన ఎమ్మెల్యే డా. చదలవాడ అరవింద బాబు

నరసరావుపేట, జనవరి ___ :
ప్రముఖ శైవక్షేత్రమైన కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి సన్నిధిలో గడచిన 50 ఏళ్లుగా నివాసం ఉంటున్న ఎస్సీ వర్గాల వారికి నివేశన పట్టాలు మంజూరు చేయాలని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సంజన సిన్హాను కోరారు.Narasaraopet MLA Dr. Chadalawada Aravind Babu visited Kotappakonda

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కోటప్పకొండ క్షేత్రంలో నిత్యం పారిశుధ్య పనులు నిర్వహిస్తూ అక్కడి పరిశుభ్రతకు కీలక పాత్ర పోషిస్తున్న పేద కుటుంబాల సేవలు ఎనలేనివని తెలిపారు. వారికి నివేశన పట్టాలు మంజూరు చేస్తే ప్రభుత్వ సహకారంతో పక్కా ఇళ్ల నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

దశాబ్దాలుగా అక్కడే నివసిస్తూ జీవనం సాగిస్తున్న పేద కుటుంబాల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని జిల్లా యంత్రాంగాన్ని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు కోరారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker