
గన్నవర:, నవంబర్ 10:-మోంత తుఫాన్ వల్ల జిల్లాలో జరిగిన నష్టాలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు వచ్చిన అంతర్ మంత్రిత్వ కేంద్ర బృందం (IMCT) సోమవారం మధ్యాహ్నం గన్నవరం ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను పరిశీలించింది.కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖ సంచాలకులు డా. కే. పొన్ను సామి నేతృత్వంలో వచ్చిన ఈ బృందంలో హైదరాబాద్ సెంట్రల్ వాటర్ కమిషన్ జలవనరుల మంత్రిత్వ శాఖ సంచాలకులు శ్రీనివాసు బైరి, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ విద్యుచ్ఛక్తి మంత్రిత్వ శాఖ ఉపసంచాలకులు ఆర్తి సింగ్, గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ సహాయ సంచాలకులు మనోజ్ కుమార్ మీనా తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డీ.కే. బాలాజీ తుఫాను కారణంగా జిల్లాలో ఏర్పడిన పరిస్థితులను, జరిగిన నష్టాలను వివరించారు. వరి పంటలు, ఉద్యాన తోటలు, ఇళ్లు, పడవలు, చేపల వలలు, రహదారులు, విద్యుత్ స్తంభాలు, పశువుల పాకలు, చనిపోయిన గొర్రెలు–మేకలు వంటి పశువుల నష్టం, మున్సిపల్, పంచాయతీ రాజ్ శాఖలకు జరిగిన నష్టాలు, ప్రజల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన సహాయక శిబిరాలు, నిత్యావసర సరుకుల పంపిణీ తదితర అంశాలపై రూపొందించిన ఫోటో ఎగ్జిబిషన్‌ను కేంద్ర బృందం ఆసక్తిగా వీక్షించింది.

కేంద్ర బృందం వెంట రాష్ట్ర వ్యవసాయ శాఖ సంచాలకులు, పౌర సరఫరాల సంస్థ ఎండి, ప్రత్యేక అధికారి ఢిల్లీ రావు, సంయుక్త కలెక్టర్ ఎం. నవీన్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు, గుడివాడ ఆర్డీవో జి. బాలసుబ్రమణ్యం, జిల్లా వ్యవసాయ అధికారి ఎన్. పద్మావతి, జిల్లా పశుసంవర్ధక అధికారి చిన్న నరసింహులు, మత్స్యశాఖ జేడీ అయ్యా నాగరాజా, గృహనిర్మాణ సంస్థ జిల్లా అధిపతి, తుఫాన్ నోడల్ అధికారి పోతురాజు, ఇఈ వెంకటరావు, జిల్లా ఉద్యాన అధికారి జె. జ్యోతి, డీటीडబ్ల్యూఓ ఫణి ధూర్జటి, జలవనరుల శాఖ ఎస్‌ఈ మోహన్ రావు, మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, పంచాయతీరాజ్ ఎస్‌ఈ రమణ రావు, శాస్త్రవేత్త సత్యనారాయణ, ఘంటసాల కెవికె సమన్వయకర్త సుధారాణి, గన్నవరం తహసిల్దారు శివయ్య, ఎంపీడీవో స్వర్ణలత తదితర అధికారులు పాల్గొన్నారు. తుఫాన్ ప్రభావం, పంటల నష్టాలు, పశుసంపద నష్టంపై విభిన్న శాఖల సమగ్ర నివేదికలను కేంద్ర బృందం సమీక్షించింది.







