
బాపట్ల:29-10-25:-మొంథా తుఫాన్ ప్రభావంతో బాపట్ల మండలం పాండురంగపురం గ్రామ పరిసరాల్లో వరి, వంగ, పచ్చిమిర్చి పంటలు నీట మునిగాయి. ఈ పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించేందుకు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి గౌ. కొలుసు పార్థసారధి బుధవారం మధ్యాహ్నం గ్రామాన్ని సందర్శించారు.

ఈ సందర్శనలో ఆయనతో పాటు బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ కూడా పాల్గొన్నారు. తుఫాన్ కారణంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మంత్రులు స్వయంగా పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.స్థానిక ప్రజలు, రైతులతో మంత్రులు మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. తుఫాన్ వల్ల నష్టపోయిన పంటలకు త్వరితగతిన సాయం అందేలా చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు.







