
మంగళగిరి, అక్టోబర్ 29:మొంథా తుఫాన్ దెబ్బతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు సాగుతున్న వేళ, రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీఎస్ శాఖల మంత్రి నారా లోకేష్ సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో మూడు రోజులుగా నిరంతర పర్యవేక్షణ నిర్వహించారు. క్షణం తీరిక లేకుండా రాష్ట్రవ్యాప్తంగా తుఫాన్ పరిస్థితులపై సమీక్షలు జరుపుతూ, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు.ఓవైపు రాష్ట్ర అధికార యంత్రాంగానికి సూచనలు, మరోవైపు మంగళగిరిలో సహాయక చర్యల సమీక్ష—ఈ రెండు రంగాల్లో సమాంతరంగా లోకేష్ చురుకుదనం కనబరిచారు. నగరపాలకసంస్థ, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులకు తగిన ఆదేశాలు, మార్గదర్శకాలు అందిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదనే దిశగా కసరత్తు సాగించారు.
గత అనుభవాలతో ముందస్తు చర్యలు
మంగళగిరిలో గత వర్షకాల అనుభవాల ఆధారంగా ముందుగానే పలు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ‘స్వచ్ఛ మంగళగిరి’ పేరిట డ్రైనేజీలలో సిల్ట్ తొలగింపు పనులు ముందుగానే పూర్తిచేయడం ఈసారి మంచి ఫలితాలను ఇచ్చింది. నగరపాలకసంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేసి, ప్రజల ఫిర్యాదులకు తక్షణ స్పందన కల్పించారు. తుఫాన్ నేపథ్యంలో 24 పునరావాస కేంద్రాలను సిద్ధం చేసి, కొండప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.ప్రజలకు తాగునీరు, ఆహారం, వైద్య సహాయం అందేలా అన్ని వసతులు కల్పించడంతోపాటు విద్యుత్ అంతరాయం లేకుండా జనరేటర్లను సిద్ధం చేశారు. ఎంటీఎంసీ అధికారులు మంత్రివర్యుల ఆదేశాల మేరకు గత రెండు రోజులుగా ప్రధాన అవుట్‌ఫాల్ డ్రెయిన్‌లలో పూడికతీత పనులు నిర్వహించారు.ఎన్నారై, కాజా టోల్ ప్లాజా, యర్రబాలెం టబాకో కంపెనీ, రైస్ మిల్ రోడ్, సుందరయ్యనగర్, నవులూరు మారుతీనగర్, ఎంఎస్ఎస్ కాలనీ, ఎంవీఐ కార్యాలయం, నిడమర్రు, ఇప్పటం రోడ్, వడ్డెరపాలెం తదితర ప్రాంతాల్లో కచ్చా డ్రైన్‌ల ఏర్పాటు, ఆయిల్ ఇంజిన్‌లతో నీటి మళ్లింపు చర్యలు చేపట్టారు.అధికారుల పర్యవేక్షణలో సమర్థ చర్యలు
జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్‌లతోపాటు వ్యవసాయ, జలవనరుల శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పునరావాస కేంద్రాల్లో పరిస్థితులను పర్యవేక్షించారు. తాగునీటి సరఫరా కేంద్రాల్లో జనరేటర్లను సిద్ధంగా ఉంచి, మంచినీటి ట్యాంకర్లు, జేసీబీలు, గల్ఫర్లు అందుబాటులో చారు.పునరుద్ధరణ పనుల్లో వేగంతుఫాన్ ప్రభావంతో కూలిపోయిన చెట్ల తొలగింపు, విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు వేగవంతం చేశారు. మంగళగిరి ఇందిరానగర్, ఎల్బీ నగర్, ఎన్నారై రోడ్, రత్నాల చెరువు, నాంచారమ్మ చెరువు ప్రాంతాలతో పాటు తాడేపల్లి, సీతానగరం, ముగ్గురోడ్డు, కేఎల్ రావు కాలనీ, మహానాడు ప్రాంతాల్లో నేలకొరిగిన చెట్ల తొలగింపు చర్యలు యుద్ధప్రాతిపదికన జరిగాయి.దుగ్గిరాల మండలంలోని ప్రతి గ్రామంలో ముంపు సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. పంట పొలాలు వరద నీటిలో మునిగిపోకుండా నీటి మళ్లింపు చర్యలు చేపట్టారు.తండ్రికి తగ్గ తనయుడుహుద్‌హుద్ తుఫాన్ సమయంలో విశాఖపట్నంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికార యంత్రాంగాన్ని దగ్గరుండి నడిపినట్లు, ఈసారి మొంథా తుఫాన్ సమయంలో మంత్రి నారా లోకేష్ కూడా అదే శైలిలో పర్యవేక్షణ చేపట్టారు. రాష్ట్రస్థాయిలో సమన్వయం చేస్తూనే మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ చూపించి తండ్రికి తగ్గ తనయుడిగా నిలిచారు.







