
పరామర్శ పేరుతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అలజడి సృష్టించారని ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు అన్నారు. అంబులెన్స్ ఆలస్యంతో ఒకరు మృతి చెందగా, అట్టహాసంగా చేసిన ర్యాలీలో మరో ఇద్దరు మృతి చెందినట్లు చెప్పారు. ఒకరిని పరామర్శించడానికి వచ్చిన జగన్.. ముగ్గురి చావుకు కారణమయ్యారని మండిపడ్డారు. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం కొత్తూరులో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలుతోపాటు ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ హాజరయ్యారు. ఈ
సందర్భంగా కన్నా మాట్లాడుతూ.. సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో బెట్టింగ్ రాయుడి పరామర్శకు వచ్చి జగన్ అరాచకం సృష్టించారని అన్నారు. జగన్ వల్లే వైకాపా ఉపసర్పంచ్ నాగమల్లేశ్వరరావు మృతి చెందినట్లు చెప్పారు. చనిపోయిన కుటుంబ సభ్యులకు జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.







