
ఏలూరు, జనవరి 07:–ఏలూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారి ఎంపీ నిధులు, కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధులతో ఏలూరు జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి కేటాయించిన అంబులెన్స్‌ను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి మరియు ఏలూరు జిల్లా ఇన్‌చార్జి మంత్రి గౌరవ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ప్రారంభించి, ఆసుపత్రి అధికారులకు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ, ప్రభుత్వాసుపత్రుల్లో మౌలిక వసతుల మెరుగుదలకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కొత్త అంబులెన్స్ ద్వారా అత్యవసర పరిస్థితుల్లో రోగులకు వేగంగా సేవలు అందించవచ్చని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉంగుటూరు ఎమ్మెల్యే శ్రీ పట్సమట్ల ధర్మరాజు గారు, ఏలూరు ఎమ్మెల్యే శ్రీ బడేటి రాధాకృష్ణయ్య (చంటి) గారు, దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు, జిల్లా టీడీపీ అధ్యక్షులు, ఏలూరు జిల్లా కలెక్టర్ శ్రీమతి కె. వెట్రి సెల్వి గారు, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ గారు పాల్గొన్నారు.ELURU JILLA VAARATHALU
అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొటికలపూడి గోవిందరావు (చినబాబు) గారు, ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జి శ్రీ రెడ్డి అప్పలనాయుడు గారు, జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ శ్రీమతి ఘంట పద్మశ్రీ ప్రసాద్ గారు, డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ గారు, రాష్ట్ర వడ్డీల సంక్షేమ అభివృద్ధి చైర్‌పర్సన్ శ్రీమతి ఘంటసాల వెంకటలక్ష్మి గారు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ జుత్తుగ నాగరాజు గారు తదితర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










