వేటపాలెం, సెప్టెంబర్ 20 వేటపాలెంలోని సెంట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీకి చెందిన విద్యార్థులు ఇటీవల జరిగిన జాతీయ స్థాయి యం.యస్.యం.ఇ ఐడియా హెకతాన్ పోటీలో తమ ప్రతిభను నిరూపించి, ఇన్నోవేటివ్ ఐడియా బహుమతులు పొందారు.
ఈ విషయాన్ని కళాశాల కార్యదర్శి వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ ఎస్.లక్ష్మణరావు వెల్లడించారు. విట్ ఏపీ యూనివర్సిటీ, అమరావతి వారు నిర్వహించిన ఈ హెకతాన్‌లో వివిధ విభాగాల విద్యార్థుల బృందాలు పాల్గొని పురస్కారాలను గెలుచుకున్నారు.
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. జగదీష్‌బాబు తెలియజేసిన వివరాల ప్రకారం, బి.టెక్ నాలుగో సంవత్సరం సీఎస్‌ఇ శాఖకు చెందిన విద్యార్థులు కె. వెంకట లక్ష్మి సాహితి, కె. కావ్య, యం. నందిని కుమారి, పీ. సల్మా మరియు ఈసీఈ శాఖకు చెందిన కె. లోహిత బృందం అవార్డులను గెలుచుకున్నారు.
అలాగే బి.టెక్ మూడవ సంవత్సరం సీఎస్‌ఇ శాఖకు చెందిన విద్యార్థులు జి. దీప్తి, సిహెచ్. యామిని, జి.వి. సాయి ప్రేమ్ గణేష్, ఎ.బి.వి.ఎస్. ప్రవీణ్ రెడ్డి, జి. శశిధర్ల బృందం కూడా ప్రతిభను చాటుకుంది.
ఈ సందర్భంగా సీఎస్‌ఇ విభాగాధిపతి డాక్టర్ పీ. హరిణి, విజేతలను అభినందించారు. అలాగే కళాశాల డైరెక్టర్ (ఆర్ అండ్ డి, అక్విడిటేషన్స్) డా. సి. సుబ్బారావు, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఆర్.వి. రమణమూర్తి, ఇతర విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు కూడా విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.