
Hyderabad:- దేశ ఆర్థికాభివృద్ధిలో రెండు దశాబ్దాలకు పైగా అఖిల భారత ఆర్య వైశ్య పారిశ్రామికవేత్తల ఫొరం (ఎ.ఐ.ఎ.వి.ఐ.ఎఫ్) కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఫోరం జాతీయ అధ్యక్షులు రాంబాబు పబ్బిశెట్టి పేర్కొన్నారు.
ప్రభుత్వ సహకారంతో యువతకు పారిశ్రామిక శిక్షణ అందించడంతో పాటు ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం, ఆర్థిక సహాయాలు కల్పించనున్నట్లు ఆయన తెలిపారు.

ఎ.ఐ.ఎ.వి.ఐ.ఎఫ్ రజతోత్సవాలను 2026 ఫిబ్రవరి 1న హైదరాబాద్ నానక్‌రామ్‌గూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ప్రధాన్ కన్వెన్షన్‌లో ఘనంగా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ప్రీ లాంచ్ మీడియా సమావేశంలో రజతోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఈ రజతోత్సవాలకు రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఆంధ్రప్రదేశ్ మంత్రి టి.జి. భరత్‌తో పాటు పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలు హాజరుకానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. యువతలో పారిశ్రామిక ఆసక్తిని పెంపొందించే లక్ష్యంతో కార్యక్రమంలో 50 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.Hyderabad Local news










