
Bapatla:24-11-25 ;-బాపట్ల మున్సిపల్ పరిధిలోని మూడవ వార్డు రెల్లి కాలనీ — 65 కుటుంబాలు నివసిస్తున్న ఈ ప్రాంతం ఏడు దశాబ్దాలుగా తీరని సమస్యలతో ఇప్పటికీ అల్లాడుతోంది. 1956 సంవత్సరం నుంచి ఇదే బస్తీలో జీవనం సాగిస్తున్న రెల్లి కాలనీ ప్రజలు ఇంకా పూర్తి స్వేచ్ఛ, స్వస్థలం, మౌలిక సదుపాయాలు లేకుండా కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.“స్వచ్ఛ భారత్ కోసం ముందుండాం… కరోనా సమయాల్లో ప్రాణాలు కోల్పోయే ప్రమాదంలో పనిచేశాం… కానీ మాకు మాత్రం ఇంకా రెండు సెంట్ల భూమి కూడా దక్కలేదు” అంటూ ప్రజలు కన్నీరు పెడుతున్నారు.ఇంటి హక్కుపత్రాలు లేక జీవిస్తున్న ఈ కార్మికులు• తాగునీరు లేదు• విద్యా సౌకర్యాలు లేవు• వైద్యానికి సరైన అవకాశాలు లేవు
• తలదాచుకునే గూడులేక శరీర ఆరోగ్యం రోజురోజుకీ క్షీణిస్తోంది
వృద్ధులు, పెద్దవారు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పారిశుధ్య కార్మికులు “మాకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదు” అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రోజూ పగలు–రాత్రులు గొడ్డు చాకిరి చేస్తూ నగర పరిశుభ్రత కోసం శ్రమించే ఈ రెల్లి కాలనీ ప్రజలు “ఈ సారైనా కలెక్టర్ వినోద్ కుమార్ గారు దయచేసి మా ఇళ్ల పట్టాలు ఇవ్వాలి… మహాప్రభో… మహాప్రభో…” అంటూ వేడుకుంటున్నారు.ఏడు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సమస్యపై అధికారులు స్పందించాల్సిందిగా రెల్లి కాలనీ ప్రజలు కోరుతున్నారు.







