
ఎన్టీఆర్:పెనుగంచిప్రోలు:12-12-25:-శివాపురం గ్రామంలో వ్యవసాయ కళాశాల, బాపట్ల విద్యార్థులు నిర్వహించిన జాతీయ సేవా పథకం (NSS) ప్రత్యేక శిబిరం వారాంతంతో ముగిసింది. డిసెంబర్ 6 నుంచి 12 వరకు సాగిన ఈ శిబిరంలో విద్యార్థులు గ్రామాభివృద్ధి, ఆరోగ్యం, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ వంటి విభిన్న సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు.శిబిరం చివరి రోజు కార్యక్రమాలు12.12.2025న చివరి రోజు భాగంగా విద్యార్థులు శివాపురం మహిళా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సంఘం (రి.నెం. 2001/13) భవనాన్ని శుభ్రపరచి, గోడలకు—తలుపులకు పెయింటింగ్ చేశారు. అదనంగా గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో మొక్కలు నాటారు.శిబిరం ముగింపు సభరైతు సేవ కేంద్రంలో నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో జాతీయ సేవా పథకం ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. బి. రవీంద్రారెడ్డి మాట్లాడుతూ, “విద్యార్థులు గ్రామస్తుల సహకారంతో ఏడు రోజులపాటు విలువైన కార్యక్రమాలను నిర్వహించారు,” అని తెలిపారు.
ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలుడిసెంబర్ 6:ప్రారంభోత్సవంతోపాటు ఇంటింటా సర్వే నిర్వహించి గ్రామ సమస్యలపై అవగాహన.డిసెంబర్ 7:స్వచ్ఛ భారత్ కార్యక్రమం. ముళ్లకంపలతో కప్పబడ్డ ప్రభుత్వ ప్రాంతాల్లో శుభ్రపరచడం, వాడుకలో లేకున్న చేతి పంపును మళ్లీ పనిచేసేలా తయారు చేయడం. పరిశుభ్రతపై ర్యాలీ.డిసెంబర్ 8:ప్లాస్టిక్ వినియోగం, దాని దుష్ప్రభావాలపై ర్యాలీ. గ్రామంలో ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ–దహనం.డిసెంబర్ 9:వయ్యారిభామ కలుపును తొలగించడం. కలుపు నివారణపై అవగాహన ర్యాలీ.డిసెంబర్ 10:బొజ్జ దంత వైద్యశాల, జగ్గయ్యపేట సహకారంతో ఉచిత దంత వైద్య శిబిరం—మందుల పంపిణీ.డిసెంబర్ 11:కృషి విజ్ఞాన కేంద్రం గరికపాడు, పశువైద్య శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం.96 పాడిపశువులు, 104 మేకలను పరీక్షించి—వ్యాధుల నివారణ ఇంజెక్షన్లుఅవసరమైన మందులు, మినరల్స్, యోటిక్స్కృత్రిమ గర్భధారణ సేవలుమేకలకు నట్టల మందుల పంపిణీగ్రామస్తులకు ప్రత్యేక ధన్యవాదాలుశిబిరం నిర్వహణలో సహకరించిన పంచాయతీ సర్పంచ్ టి. లక్ష్మణరావు, మాజీ సర్పంచ్ ఎల్. మోహనరావు, గ్రామస్తులకు విద్యార్థులు, కళాశాల తరఫున నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
NTR JILLAపాల్గొన్నారుకృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డా. రవి కిషోర్, ప్రోగ్రామ్ ఆఫీసర్లు డా. బి. రవీంద్రారెడ్డి, డా. అబ్దుల్ సలాం, డా. పి. సుధా జాకబ్, డా. వి. సీతారామ్ బాబు, NSS వాలంటీర్లు, శివాపురం గ్రామస్తులు.







