
బాపట్ల జిల్లా, పర్చూరు నియోజకవర్గం, చిన్నగంజాం మండలం:-అత్యవసర చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందింది. పర్చూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గారి సిఫారసు మేరకు LOC ద్వారా పర్చూరు మండలం అన్నబోట్లవారిపాలెం గ్రామానికి చెందిన బిరుదు రాహేలు కు రూ.49,319 చెక్కును మంజూరు చేశారు.
ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు క్యాంపు కార్యాలయంలో నాయకులు, క్యాంపు కార్యాలయం ప్రతినిధులు లబ్ధిదారులకు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సహాయ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.bapatla news







