
గుంటూరు, అక్టోబర్ 14:-ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనను ముగించుకుని ఈరోజు గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు.ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా గుంటూరు జిల్లా తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు మరియు తాడికొండ శాసన సభ్యుడు తెనాలి శ్రావణ్ కుమార్, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, ఆంధ్రప్రదేశ్ మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ పీతల సుజాత ఘనంగా స్వాగతం పలికారు.
ఢిల్లీ పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశమై రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, కేంద్ర పథకాల అమలు తదితర అంశాలపై చర్చలు జరిపినట్టు సమాచారం.ఉండవల్లి నివాసానికి చేరుకున్న ముఖ్యమంత్రిని పలువురు పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు అభినందించారు. అక్కడ అతిథి గౌరవంగా స్వాగతించిన నాయకులు, ముఖ్యమంత్రి తాజా పర్యటన ఫలితాలపై ఆసక్తిగా చర్చించినట్లు తెలుస్తోంది.







