
వేటపాలెం: డిసెంబర్ 23:-స్థానిక సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, చీరాల విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారితో క్వాంటమ్ కంప్యూటింగ్‌పై నిర్వహించిన జూమ్ మీటింగ్‌లో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి వనమా రామకృష్ణా రావు, కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు మాట్లాడుతూ క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి ఆధునిక సాంకేతిక రంగాల్లో విద్యార్థులు అవగాహన పెంపొందించుకోవడం అభినందనీయమని తెలిపారు.
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. జగదీష్ బాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నేరుగా విద్యార్థులతో సంభాషించడం వారి భవిష్యత్ కెరీర్‌కు దిశానిర్దేశం చేస్తుందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ క్వాంటమ్ కంప్యూటింగ్ ఒకటే అయినప్పటికీ దాని ఉపయోగాలు అనేక రంగాల్లో విస్తరించాయని తెలిపారు. 2047 నాటికి క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో మొదటి స్థానంలో నిలవాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. డేటా సెంటర్లు, ఎకోసిస్టమ్స్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో క్వాంటమ్ కంప్యూటింగ్ కీలక పాత్ర పోషించనున్నదని అన్నారు.
విద్యార్థులు కష్టపడి చదివి రాబోయే 30 సంవత్సరాల్లో గ్లోబల్ లీడర్లుగా ఎదగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.Chirala Local News
ఈ జూమ్ మీటింగ్‌లో ఏఐ & ఎంఎల్ విభాగాధిపతి డాక్టర్ సి.హెచ్ హరికిషన్, వివిధ విభాగాల అధ్యాపకులు, అలాగే ఏఐ & ఎంఎల్ విభాగానికి చెందిన రెండో, మూడో సంవత్సరం విద్యార్థులు పాల్గొన్నారు.







