
గుడివాడ :29-11-25:-కృష్ణా జిల్లా గుడివాడలో మైనార్టీ సోదరుల అభ్యున్నతే తనకు ప్రధాన లక్ష్యమని స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మసీదుల ఇమామ్, మౌజన్‌లకు 12 నెలల గౌరవ వేతనాలను విడుదల చేయడంతో, గుడివాడ టిడిపి కార్యాలయంలో మైనార్టీ నాయకులు “థాంక్యూ సీఎం సార్” కార్యక్రమం నిర్వహించారు.

ఎన్నికల ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రభుత్వం పనిచేస్తోందని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రజలకు హామీ ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే రాము అభినందించారు. “విజనరీ నాయకుడైన సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టే పనిలో దృఢంగా ముందుకు సాగుతున్నారు” అని ఆయన పేర్కొన్నారు.కార్యక్రమంలో టిడిపి మైనార్టీ నాయకులు షేక్ మౌలాలి, సయ్యద్ జబీన్, రఫీ, సర్దార్ బేగ్, కరిముల్లా, అబ్దుల్ సత్తార్, షేక్ జానీ, నూర్, లాల, ముస్లిం మతగురువులు తదితర మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.







