
గుంటూరు, నవంబరు 20: తెనాలి నియోజక వర్గం కొల్లిపర మండలం దావులూరు గ్రామంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆహార పౌర సరఫరాలు మరియు వినియోగ దారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా , సంయుక్త కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ , తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహాలతో కలసి రైతు సేవ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలును ప్రారంభించారు.
అనంతరం దావులూరు గ్రామంలో వేణుగోపాల స్వామి దేవస్ధానంలో నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ గతంలో కొల్లిపర మండలంలోని స్ధానికంగా వున్న వ్యాపారులకు ధాన్యం విక్రయించడం జరిగేదని, కూటమి ప్రభుత్వం రైతులు పడుతున్న కష్టాలను గుర్తించిందన్నారు. దానిలో మార్పు తేవడానికి అనేక సంస్కరణలు తెచ్చామన్నారు. గత ప్రభుత్వం బకాయి పెట్టిన 1674 కోట్ల రూపాయలను ఆర్ధిక ఇబ్బందులను చెల్లింపు చేయడం జరిగిందని పేర్కొన్నారు. 👫❤️ “City Marriage Bureau – విశ్వసనీయమైన వరుడు–వధువు మ్యాచింగ్ సర్వీస్”🔗 https://citymarriagebureau.com/
ఇక్కడ పండే సన్న రకం బియ్యం 41 వేల పాఠశాల మధహ్నం భోజన పధకానికి 4 వేల సంక్షేమ పధకాని అందిస్తున్నామని 25 కేజీల రైస్ బ్యాగ్ ని పి.ఆర్. కోడ్ తో అందిస్తున్నామన్నారు. గత సంవత్సరం 40 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం జరిగిందని , ఈ సంవత్సరం 51 మెట్రిక్ టన్నుల కొనుగోలుకు నిర్ణయించామని పేర్కొన్నారు. రైతు ధాన్యం ఏమిల్లరుకైన అమ్ముకోవచునన్నారు. జిల్లాలో 209 రైతు సేవ కేంద్రాలు 49 క్లష్టర్లు వున్నాయని అన్నిటిలో ధాన్యం కొనుగోలు చేయుటం జరుగుతుందన్నారు. 6కోట్ల 54 లక్షల గోతాలు ధాన్యం సేకరణకు సిద్ధం చేయడం జరుగుతుందని అన్నారు. గతంలో ధాన్యం కొనుగోలు చేసిన అనంతరం 48 గంటలలో రైతు ఖాతాలో నిధులు జమఅయ్యేయని ఇప్పుడు సరకు అందించిన 6 గంటలలో డబ్బు జమ అయ్యేలాగా చూస్తామన్నారు.
దళారులకు 75 కేజీల బస్తా రూ.1400/-ల నుండి రూ.1430/-లకు అమ్ముకుంటున్నారని ప్రభుత్వం సాధాన రకం ( కామన్ ) క్వింటా రూ 2369/-లు, 75 కిలోలు రూ. 1777/-లు గ్రేడ్ ఏ రకం క్వింటా రూ. 2329/-లు , 75 కేజీల బస్తా రూ.1792/-లు కొనుగోలు చేస్తుందని రైతులు నష్టానికి అమ్ముకోకుండా ప్రభుత్వానికి అమ్మాలని రైతులకు విజ్ణప్తి చేశారు. రాబోయే రోజులలో అదనంగా ఆదాయం పొందాలంటే మనం కూడా మన అలవాట్లు మార్చుకొని ఉద్యాన పంటలు వేయడానికి పరిశీలించాలన్నారు.💝🤵👰 “సంపూర్ణ వివాహ సౌభాగ్యానికి మీ అడుగు – City Marriage Bureau”🔗 https://citymarriagebureau.com/
వాతావరణం మారుతున్నందున టార్పాలిన్ పట్టాలను రైతులకు ఉచితంగా అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని , ప్రతి రైతు సేవా కేంద్రంలో 25 టార్పాలిన్ పట్టాలను 3 రోజులలో ఏర్పాటు చేస్తామని దాన్ని రైతులు ఉపయోగించుకోవాలన్నారు. రాబోయే రోజుల్లో టెక్నాలజీని ఎక్కువ ఉపయోగించాలని డ్రోన్ లు వాడాలని , యూరియాను ఎక్కువ గా వాడ వద్దని కొల్లిపర మండలంలో పండిన ధాన్యం ప్రభుత్వానికి అమ్మాలని కోరారు . కొల్లిపర మండలంలో 14 వేల ఎకరాలు వరి సాగు అవుతుందని, ప్రతి బస్తా , ప్రతి గింజ కొనడానికి ప్రభుత్వం సహాయం చేస్తుందని తేమ 17 శాతం వుండే లాగా చూసుకోవాలన్నారు. 💑 “City Marriage Bureau – సరైన జంటకు సరైన వేదిక”
👉 Register Her🔗 https://citymarriagebureau.com/
27, 28 తేదీలలో అల్పపీడనం వున్నదని వాతావరణ శాఖ హెచ్చరిక చేసిందని కోతలకు సిద్దపడిన వారు రెండు రోజులులోగా కోయాలన్నారు. ధాన్యం సేకరణకు 16 వేల మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందని 32 వేల లారీలు, ట్రాక్టర్లుకు, జీపీఎస్ తో సిద్దం చేయడం జరిగిందని , 6కోట్ల 54 లక్షల గోతాలు సిద్దం చేశామన్నారు. విత్తనము నుండి విక్రయం దాకా మీతోనే వుంటామని డిశంబరు 31 టార్గెట్ గా పెట్టుకున్నామని రైతు సోదరులు ప్రభుత్వానికి ధాన్యాన్ని అమ్మాలని విజ్నప్తి చేశారు.
జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా మాట్లాడుతూ జిల్లాలో గత సంవత్సరం ఏర్పడిన సమస్యలను అధిగమిస్తూ 100 శాతం ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. గత సంవత్సరం 40 మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరణ చేయడం జరిగిందని, ఈ సంవత్సరం 50 వేల మెట్రిక్ టన్నులు టార్గెట్ గా నిర్ణయించడం జరిగిందని, ఇప్పుడు దానిని 70 వేల మెట్రిక్ టన్నులు లక్ష్యంగా నిర్ణయించారని, కానీ జిల్లా యంత్రాంగం లక్ష మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. 💑 “City Marriage Bureau – సరైన జంటకు సరైన వేదిక”
👉 Register Her🔗 https://citymarriagebureau.com/
గన్ని బ్యాగ్స్ , ట్రాన్స్ పోర్టేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని కొంత మంది రైతులు వరి కోసే యంత్రాలు తక్కువ గా వున్నాయని చెప్పుతున్నారని, ప్రక్క జిల్లా నుండి తెప్పించాల్సిందిగా మంత్రి సూచించారని అన్నారు. తదనుగుణంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. 27, 28 తేదీలలో అల్పపీడనం వున్నదని వాతావరణ శాఖ హెచ్చరిక చేసినందున ముందస్తు చర్యగా రైతులకు టార్పాలిన్ లు రైతు సేవా కేంద్రంలో అందుబాటులో వుంచడం జరుగుతుందన్నారు. జిల్లా స్ధాయిలో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ధాన్యం సేకరణ పై రైతులు ఏ సమస్య వున్న తెలియ జేసిన యెడల అప్పటికప్పుడు సమస్యను పరిష్కరించడానికి జిల్లాలోని అధికారులందరు అందుబాటులో వుండేలాగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 💑 “City Marriage Bureau – సరైన జంటకు సరైన వేదిక”
👉 Register Her🔗 https://citymarriagebureau.com/
రైతుల వద్ద సంతృప్తికర స్ధాయిలో ధాన్యం సేకరణ చేయదానికి అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్ట పద్మావతి , సివిల్ సప్లయ్ జిల్లా మేనేజర్ తులసి , జిడిసి ఏం ఎస్ హరి గోపాల్ , డిఎస్.ఓ కోమలి పద్మ, ఏఎస్.ఓ మనోహర్ , ఏ.డిఏ. విజయ బాబు , కొల్లిపర తాసీల్దార్ సిద్దార్ధ, ఇన్ చార్జి ఎంపీడిఓ భార్గవ , దావులూరు సర్పంచ్ అంబటి సంధ్యాదేవి, ఏం.పి.టి.సి బోసు బాబు, తెనాలి మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ తోటకూర వెంకట రమణ , జనసేన నాయకులు అడపా నారాయణ రెడ్డి , జనసేన మండల పార్టీ అధ్యక్షులు దివ్వెల వెంకయ్య నాయుడు, తదితరులు పాల్గొన్నారు.








