Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్

నాగ చైతన్య సమంతకు పబ్లిక్‌గా ప్రపోజ్ చేసిన వీడియో వైరల్ – సామ్ కౌంటర్, వారి కెమిస్ట్రీపై మళ్లీ చర్చ…

టాలీవుడ్‌లో ఒకప్పుడు బెస్ట్ జోడీగా పేరుగాంచిన నాగ చైతన్య, సమంతలు విడాకుల తర్వాత కూడా వారి కెమిస్ట్రీ, వ్యక్తిగత జీవితం ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా వీరి జంటకు సంబంధించిన ఓ పాత వీడియో మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియో ‘మనం’ సినిమా ప్రమోషన్స్ సమయంలో తీసినదిగా తెలుస్తోంది. ఇంటర్వ్యూలో యాంకర్ నాగ చైతన్యను సమంతకు ప్రపోజ్ చేయమని కోరగా, నాగ చైతన్య అందరూ చూస్తుండగా “ఐ లవ్ యు సామ్” అని చెప్పాడు. దీనిపై సమంత వెంటనే స్పందిస్తూ, “ఏదో చెప్పాలన్నట్టు కాకుండా, మనస్ఫూర్తిగా చెప్పు” అంటూ చైతన్యకు కౌంటరిచ్చింది. దీంతో నాగ చైతన్య మరింత సీరియస్‌గా మరోసారి ప్రపోజ్ చేయగా, సమంత సిగ్గుపడటం, వారి మధ్య ఉన్న కెమిస్ట్రీ స్పష్టంగా కనిపించింది.

ఈ సంఘటన జరిగినప్పుడు వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని బయటకు తెలియదు. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అభిప్రాయ భేదాల వల్ల విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం సమంత ఒంటరిగా ఉంటూ, ఆరోగ్య సమస్యలతో కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. నాగ చైతన్య మాత్రం శోభిత ధూళిపాళితో ప్రేమ వివాహం చేసుకున్నారు.

ఈ వీడియో మళ్లీ వైరల్ కావడంతో, వారి మధ్య ఉన్న సహజమైన కెమిస్ట్రీ, అప్పటి బంధం గురించి అభిమానులు, నెటిజన్లు చర్చించుకుంటున్నారు. సమంత తనదైన స్టైల్‌లో చైతన్య ప్రపోజల్‌కు స్పందించిన తీరు, వారి మధ్య ఉన్న స్నేహం, అనుబంధాన్ని గుర్తు చేస్తోంది. విడాకుల తర్వాత కూడా వీరి జంటపై అభిమానుల్లో ఆసక్తి తగ్గలేదు.

Authors

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button