బోధన, పరిశోధనలో అగ్రగామిగా నిలుస్తూ… ప్రపంచ స్థాయి మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తూ విద్యా సుగందాలను వెదజల్లుతూ.. రాజధాని విశ్వవిద్యాలయం గా ఖ్యాతి గడిరచిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం 49వ వ్యవస్థాపక దినోత్సవం వేడుకకు సిద్ధమైంది.
గత విజయాలను స్మరించుకుంటూ భవిష్యత్తు లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి ఇది ఒక చక్కని అవకాశంగా, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం రాబోయే రోజుల్లో ఒక అంతర్జాతీయ స్థాయి విద్యా కేంద్రంగా ఎదగడానికి ఈ ప్రయాణం ఒక పునాదిగా నిలువనుంది. స్థాపన మరియు ప్రారంభ దశ :`
తొలుత గుంటూరు, కృష్ణ, ప్రకాశం ప్రాంత ప్రజల ఉన్నత విద్యా అవసరాలను తీర్చడానికి 1970లో గుంటూరు జిల్లా నల్లపాడు లో ఆంధ్ర విశ్వవిద్యాలయం పోస్ట్-గ్రాడ్యుయేట్ కేంద్రంగా ప్రారంభమై, 1976 సెప్టెంబర్ 11వ తేదీ స్వతంత్ర విశ్వవిద్యాలయంగా నాగార్జున విశ్వవిద్యాలయం పేరుపొందింది. అప్పటి భారత రాష్ట్రపతి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ చేతుల మీదుగా సుమారు300 ఎకరాల విస్తీర్ణంలో గుంటూరు, విజయవాడ ప్రాంతాల మధ్య ఏర్పాటు చేయబడిరది. గొప్ప బౌద్ధ తత్వవేత్త ఆచార్య నాగార్జునుడి స్మారకార్థం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంగా పేరు గడిరచి ఈ ప్రాంతంలో చారిత్రక, విద్యా వైభవాన్ని కనబరిచింది.
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఆర్ట్స్ ,సైన్స్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్ వంటి ఆరు కళాశాలలు ఉన్నాయి. నేడు రెగ్యులర్ విధానంలో 65 యుజి,పిజి, వృత్తి విద్య కోర్సులు అందిస్తున్నది. 2008లో ప్రారంభమైన దూరవిద్య కేంద్రం 43 కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
సి ఎస్ ఆర్, సెంటర్ ఫర్ ఉమెన్ స్టడీస్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అధ్యయన కేంద్రం, మహాత్మ జ్యోతిరావు పూలే అధ్యయన కేంద్రం, బాబు జగ్జీవన్ రామ్ చైర్, సెంటర్ ఫర్ గాండియన్ స్టడీస్ డాక్టర్ కొత్త సచ్చిదానందమూర్తి అధ్యయన కేంద్రం నెలకొల్పడం ద్వారా విస్తృత పరిశోధనలకు అవకాశం కల్పిస్తుంది. వీటితోపాటు వర్సిటీకి 220 అనుబంధంగా కళాశాలలు ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సౌజన్యంతో ఇంజనీరింగ్ మరియు సైన్స్ సంబంధిత ప్రతిష్టాత్మక ప్రయోగశాలలు అందుబాటులో ఉన్నాయి. యూజీసీ, సి ఎస్ ఐ ఆర్, ఐ సి ఎస్ ఎస్ ఆర్, డి బి టి, ఇస్రో వంటి జాతీయ సంస్థల ద్వారా రీసెర్చ్ ప్రాజెక్టులు మరియు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి. వందల సంఖ్యలో ఐసిటి తరగతి గదులు అందుబాటులో ఉన్నాయి. నాక్ ఏ ప్లస్ గ్రేడ్ :-
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ విద్యార్థులు, పరిశోధకులు, బోధనేతర సిబ్బంది సమిష్టి కృషి మరియు సాధించిన ప్రగతి ఆధారంగా టైర్ టు విభాగంలో 2024 లో 3.6 స్కోర్‌తో నాక్ ఏ ప్లస్ గ్రేడ్ ను సాధించింది. ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో చెప్పులు లేని నడక అంశంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో చోటు దక్కించుకుంది. జాతీయ సంస్థలు, ప్రైవేటు విశ్వవిద్యాలయాలతో పోటీపడుతూ ప్రతి ఏటా వివిధ రంగాలకు చెందిన నిష్ణాతులతో విద్యార్థులకు వృత్తి నైపుణ్యం మరియు ఉపాధి కల్పనకు సంబంధించిన శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా గత విద్యా సంవత్సరం సుమారు 500కు పైగా విద్యార్థులు వివిధ ప్రతిష్టాత్మక సంస్థలలో ఉద్యోగ అవకాశాలు పొందారు.
జాతీయ విద్యా విధానంకు అనుగుణంగా వేగవంతముగా మారుతున్న సాంకేతిక అభివృద్ధిలో భాగంగా విద్యార్థులలో మరింత నైపుణ్యాన్ని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా విశ్వవిద్యాలయంలో క్వాంటం మిషన్ ను ఏర్పాటు చేయడం జరిగింది.
పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యా విషయక అంశాలను అభివృద్ధి చేసేందుకు వీలుగా సుమారు 15 జాతీయ అంతర్జాతీయ సంస్థలతో ఈ ఏడాది అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. సమర్థవంతమైన నిర్వహణ, ప్రతిభ ఆధారంగా యూనివర్సిటీ రూసా కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోడల్ సెంటర్ గా గుర్తించింది. ఈ నిధుల ద్వారా వివిధ పరిశోధన కు సంబంధించిన ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయడం జరిగింది.
విశ్వవిద్యాలయ నిధులతో పాటు రూసా నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకొని పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం మరియు పలు పరిశోధన పరికరాలను కొనుగోలు చేయడం జరిగింది. అదేవిధంగా హబ్ సెంటర్ మరియు వసతి గృహాల నిర్మాణం చేపట్టారు. విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు :-
రెండు ఎకరాల విస్తీర్ణంలో అరుదైన ఔషధ మొక్కల పెంపకం జరుగుతుంది. వందల సంఖ్యలో మెడికల్ ప్లాంట్స్ ను అభివృద్ధి చేస్తున్నారు. మూడు ఎకరాల విస్తీర్ణంలో ఆర్గానిక్ వెజిటేబుల్ గార్డెన్ ద్వారా కూరగాయలు పండిస్తున్నారు. వాటిని వసతి గృహాలలో ఆహార పదార్థాలు తయారీలో వినియోగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సౌజన్యంతో 2 మెగా వాట్స్ తో సోలార్ పవర్ జనరేటింగ్ స్టేషన్‌ను మరియు బయోగ్యాస్ ప్లాంటును నెలకొల్పారు. దివ్యాంగులు, మహిళలు, వయోవృద్ధులను దృష్టిలో పెట్టుకొని బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ ను ఏర్పాటు చేశారు.
ప్రతి విద్యార్థి పురోగతి సాధించే దిశగా ప్రణాళికలు రూపొందించారు. దానిలో భాగంగా ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రత్యేక బహుమతులు అవార్డులను అందిస్తున్నారు. వివిధ క్రీడాంశాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అదనంగా మార్కులు, నగదు పురస్కారాలను అందిస్తున్నారు. మెడికల్ నిధి, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజ్ వంటి సదుపాయాలు కల్పిస్తున్నారు. పరిశోధకులకు యూనివర్సిటీ రీసెర్చ్ ఫెలోషిప్‌లు అందజేస్తున్నారు. పూర్వ ఉపకులపతులు హాజరు…
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతులు గా విశిష్ట సేవలు అందించిన పలువురు వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రొఫెసర్ డి. రామకోటయ్య, ప్రొఫెసర్ సి.వి. రాఘవులు, ప్రొఫెసర్ ఎల్. వేణుగోపాల్ రెడ్డి, ప్రొఫెసర్ వి. బాల మోహన్ దాస్, ప్రొఫెసర్ వై. ఆర్. హరగోపాల్ రెడ్డి, ప్రొఫెసర్ ఏ. రాజేంద్రప్రసాద్ తదితరులు హాజరుకానున్నారు. 







