

బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం పరిధిలోని 216 నేషనల్ హై వే పక్కన వేంచేసియున్న శ్రీ నాగేంద్రస్వామి ఆలయం తొమ్మిదవ వార్షికోత్సవం మరియు సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాశీ నుండి తెప్పించబడిన ప్రతిష్టాత్మక శివలింగ ప్రతిష్ఠా మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేయబడిన ప్రత్యేక పూజా కార్యక్రమం మరియు మహాన్నదాన కార్యక్రమాలలో నిర్వాహకులతో కలిసి పాల్గొన్న ఆ సెగ్మెంట్ ఎంపీటీసీ సభ్యులు మరియు మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు.

ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు మాట్లాడుతూ, శివలింగ ప్రతిష్ఠా మరియు నాగేంద్ర స్వామి ఆలయం తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా వేలాదిమంది భక్తులకు మహాన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయటం హర్షణీయం అని కొనియాడారు. నల్లమోతువారిపాలెం గ్రామ ప్రజలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాజీ సైనికులు, కుటుంబ సభ్యులు మరియు ప్రజలు సుభిక్షంగానూ మరియు సుఖ సంతోషాలతో ను వర్ధిల్లె విదంగా ఆశీర్వదించాలి అని ఆ భగవంతుడిని కోరుకున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర తెలిపారు.కార్యక్రమంలో నిర్వాహకులు సూరగాని వీర్లంకయ్య, మన్నెం నాగయ్య, రమేష్ మొదలగువారు పాల్గొన్నారు.








