
భట్టిప్రోలు:
భట్టిప్రోలు మండలానికి చెందిన అనారోగ్యంతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందిన ఐదుగురు బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుండి ఆర్థిక సహాయం మంజూరైంది. వేమూరు నియోజకవర్గ శాసనసభ్యులు నక్కా ఆనంద బాబు ఇచ్చిన రిఫరెన్స్ లేఖ ఆధారంగా బాధితుల చికిత్స బిల్లులను CMRF కార్యాలయానికి పంపించగా, తదుపరి సహాయం చెక్కు రూపంలో మంజూరు చేశారు. Vemuru Local News :స్టార్ ఫెస్టివల్ అండ్ సెమీ క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా-వేమూరు ఎమ్మెల్యే ఆనందబాబు
జువ్వలపాలెం గ్రామానికి చెందిన మండవ వెంకట సుబ్బారావుకు రూ.64,578, కిష్కింధపాలెం గ్రామానికి చెందిన కొల్లి శాంతకుమారికి రూ.48,830, కొల్లూరు గ్రామానికి చెందిన బండి లక్ష్మీకి రూ.30,000, చిలుమూరు గ్రామానికి చెందిన కంభం సంతోషంకు రూ.35,000, సుగ్గుణలంక గ్రామానికి చెందిన సుగుణ శాన్వికకు రూ.30,786 చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. మొత్తం రూ.2,09,194 మేర సహాయం మంజూరైంది.
మంజూరైన మొత్తాన్ని మాజీ మంత్రి మరియు వేమూరు నియోజకవర్గ శాసనసభ్యులు నక్కా ఆనంద బాబు లబ్ధిదారులకు చెక్కు రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతోందని తెలిపారు. అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు.
బాధితులు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందిన సహాయానికి ప్రభుత్వానికి, అలాగే తనకు సహకరించిన శాసనసభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.








