
నందిగామ: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని నందిగామ పట్టణంలోని పాత కూరగాయల మార్కెట్ రామాలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక ఉత్సాహంతో నిర్వహించారు. ఈ వేడుకలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ధర్మరక్షణ కోసం సీతామాత పడ్డ కష్టాలు, ఆమె త్యాగనిరతి ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని, రాముడి ధర్మపాలన నేటికీ భారతీయుల గుండెల్లో సజీవంగా ఉందని కొనియాడారు.

ఆలయ ప్రాంగణమంతా భక్తుల “జై శ్రీరామ్” నినాదాలతో మారుమోగింది. కూటమి నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు అశేష భక్తజనం ఈ కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయడంతో పాటు ప్రసాద వినియోగం చేపట్టారు. ఈ వేడుక నందిగామలో భక్తి భావనను వెల్లివిరియజేసింది.http://NTR DISTRICT NEWS







