
అమరావతి: అక్టోబర్ 12, 2025సామాజిక సేవలో తనదైన ముద్ర వేసుకుంటూ ప్రజల మన్ననలు పొందుతున్న నారా భువనేశ్వరి తాజాగా మరో గౌరవాన్ని అందుకున్నారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (IOD) 2025 సంవత్సరానికి ఆమెను “డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు”కు ఎంపిక చేసింది.
ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా తలసేమియా బాధితుల సంక్షేమం కోసం శ్రమిస్తూనే, మహిళా సాధికారత, ఆరోగ్య సేవలు, విద్యా అభివృద్ధి వంటి అనేక రంగాల్లో సేవా కార్యక్రమాలు చేపడుతున్న భువనేశ్వరి, సామాజిక సేవలో ఒక మార్గదర్శిగా నిలుస్తున్నారు.ఈ సందర్భంగా హోం మంత్రి వంగలపూడి అనిత ఆమెకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. “తెలుగు మహిళలుగా మేమందరం గర్వపడే అవకాశం ఇది. భువనేశ్వరి గారి స్ఫూర్తితో మరెందరో సమాజసేవ వైపు అడుగులు వేస్తున్నారు. ఆమెకు అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నాం” అని అన్నారు.







