
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ బుధవారం మచిలీపట్నం పర్యటించనున్నారు. హౌసింగ్ బోర్డ్ సెంటర్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం కృష్ణ యూనివర్సిటీలో జరిగే కార్యక్రమం కు హాజరుకానున్నారు. లోకేష్ మచిలీపట్నం పర్యటించనున్న నేపథ్యంలో కార్యకర్తలతో సమావేశమయ్యే ప్రాంతంలో సభ స్థలాన్ని తెలుగుదేశం పార్టీ సిద్ధం చేస్తోంది.
 
  
 






