
నరసరావుపేట:-నరసరావుపేట పట్టణంలోని కే–రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో 2వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఉత్సాహభరిత పాల్గొనడంతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నెల్లూరు జిల్లా కలెక్టర్ శ్రీ హిమాన్ష్ శుక్లా ఐఏఎస్ మాట్లాడుతూ, విద్య అనేది వ్యక్తి జీవితాన్ని మలిచే శక్తివంతమైన సాధనమని పేర్కొన్నారు. Wonderful Narasaraopet Development Target by 2030: The Sky is the Limit!||2030 నాటికి అద్భుతమైన Narasaraopet Development లక్ష్యం: ఆకాశమే హద్దు!జట్టు పని, నాయకత్వ లక్షణాలు విద్యార్థుల భవిష్యత్తు ఎదుగుదలకు కీలకమని ఆయన సూచించారు.

వేడుకల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, నాటికలు, కరాటే, సంగీత కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. చిన్నారుల ప్రతిభకు హాజరైన అతిథులు ప్రశంసలు కురిపించారు.
ఈ కార్యక్రమంలో మాలవత్ పూర్ణ, పూల వెంకటబాల, నల్లబోతు వెంకటరావు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

పాఠశాల చైర్మన్ నాతాని వెంకటేశ్వర్లు, డైరెక్టర్ కోమటనేని నాసరయ్య, ప్రిన్సిపాల్ జి. బర్నబాస్ ఆధ్వర్యంలో వేడుకలు సవ్యంగా నిర్వహించబడగా, చివర్లో నిర్వాహకులు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.










